R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..

పూజా హెగ్డే పైన సీనియర్ నటి రోజా భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి ఫైర్ అయ్యారు..

R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..

R K Selvamani

R K Selvamani: పూజా హెగ్డే.. తెలుగు, తమిళ్‌తో అడపాదడపా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు భారీ పారితోషికం కూడా అందుకుంటుంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే..

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో ‘బీస్ట్’ మూవీలో నటిస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలోనూ పూజా పాపనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా పూజా హెగ్డే పైన సీనియర్ నటి రోజా భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి ఫైర్ అయ్యారు.

Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!

పద్ధతి మార్చుకోవాలంటూ చిన్నపాటి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. ‘కెరీర్ స్టార్టింగ్‌లో పూజా, ఒక అసిస్టెంట్‌తో సెట్‌కి వచ్చేది. ఇప్పుడు స్టార్ డమ్‌తో పాటు వరుసగా సినిమాలు రావడంతో ఏకంగా 12 మంది స్టాఫ్‌తో షూటింగ్ స్పాట్‌‌కి వస్తోంది. అంతమంది అంటే నిర్మాతకి ఖర్చు తడిసి మోపెడవుతుంది. తన పర్సనల్ స్టాఫ్ కారణంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్..?’ అంటూ సెల్వమణి విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సెల్వమణి విషయంలో పూజా ఎలా రెస్సాండ్ అవుతుందోనని నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..