Romantic: మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథకు ఎమోషన్ తోడైతే రొమాంటిక్!

డేరింగ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్లు..

Romantic: మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథకు ఎమోషన్ తోడైతే రొమాంటిక్!

Romantic

Romantic: డేరింగ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్లు, పాటలు, ట్రైలర్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్స్ చేత ప్రమోషన్ చేపట్టిన యూనిట్ సినిమా మీద చేసే కామెంట్స్ మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన యూనిట్ సినిమా చేసే ఈ కామెంట్స్ తో పూరి వారసుడు ఈసారి హిట్టు కొట్టడం పక్కా అని ఇండస్ట్రీ టాక్ మొదలైంది.

Bigg Boss 5: సన్నీ ఆ హక్కు నీకే ఉంది.. ప్రియా ఎమోషనల్ కామెంట్స్!

ఇప్పటికే ఈ సినిమా చూసేసిన దర్శకుడు పూరి ఎలా రియాక్ట్ అయ్యాడో చెప్తూ దర్శకుడు అనిల్‌ పాదూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ కాపీ చూసిన అనంతరం పూరి కన్నీళ్లు పెట్టుకున్నారని.. రొమాంటిక్ సినిమాలో ఇంత ఎమోషన్‌ ఉందా అని ఆయనే ఒకటికి పదిసార్లు తలచుకున్నారని.. ఆయన తెరక్కించిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాను మించి ఈ సినిమాలో ఎమోషన్ క్యారీ అయిందని.. సినిమా హిట్టు పక్కా అని అనిల్ కామెంట్స్ చేశాడు.

RGV: శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే తెలిసింది.. ‘మా’ అనేది ఉందని!

ఇది ‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథేనని నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా మంచి భావోద్వేగాలు తోడవడంతో సినిమా అందరికీ చెరువవుతుంది అనిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ ఇచ్చాడు. హీరోయిన్ కేతిక శర్మ గ్లామర్.. రమ్యకృష్ణ యాక్టింగ్ ఈ సినిమాకు అదనపు అసెట్ కాగా.. ఆకాష్ ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నాడు.