Major: మేజర్ నుండి రొమాంటిక్ మెలోడీ.. ఓహ్ ఇషా సాంగ్ రిలీజ్!

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు.

Major: మేజర్ నుండి రొమాంటిక్ మెలోడీ.. ఓహ్ ఇషా సాంగ్ రిలీజ్!

Major

Major: వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, వీరమరణం.. అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను కళ్ళకు కట్టినట్లుగా గ్రిప్పింగ్ గా చూపించబోతున్నారు.

Major: క్రష్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నిటినీ మించి సైనిక పోరాటం!

తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ట్రైలర్ తో పాటు మొదటి పాట కూడా విడుదల చేయగా ఊహించని రెస్పాన్స్ అందుకుంది. కాగా, ఇప్పుడు సెకెండ్ సింగల్ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు. ఓహ్ ఇషా అంటూ సాగే ఈ పాటను అందమైన మెలోడీగా చిత్రీకరించగా.. మేజర్ యూనిట్ చెప్పినట్లుగానే ఫూరెస్ట్ లోవబుల్ మెలోడీగా తెరకెక్కించారు. 1995 కాలం నాటి వింటేజ్ లుక్ లో డిజైన్ చేసిన ఈ పాట అప్పటి కాలంలోకి తీసుకెళ్లింది.

Major: ఉద్విగ్నంగా ‘మేజర్‌’ ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు

ఈ పాటలో మేజర్ సందీప్ స్కూల్, కాలేజ్ డేస్ లవ్ ను అందంగా చూపించగా.. ఓహ్ ఇషా సాంగ్ మెలోడీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.