RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు ఎంతో తెలుసా??

ఈ సినిమాలోని న‌టిన‌టుల పారితోషికాలు కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి గాను రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ మూడేళ్ళ సమయం కేటాయించారు. వీరిద్దరూ ఇప్పటివరకు......

RRR :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు ఎంతో తెలుసా??

Rrr

 

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు, శ్రేయ, కొంతమంది తమిళ్, హాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం అన్ని భాషల్లో నుంచి ఆర్టిస్టులని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోకి తీసుకున్నారు.

ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మార్చ్ 25న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని డివివి దాన‌య్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు.

Pooja Hegde : ‘రాధేశ్యామ్’ రిజల్ట్ ఎలా ఉన్నా.. అంటూ పూజాహెగ్డే ట్వీట్

ఇక ఈ సినిమాలోని న‌టిన‌టుల పారితోషికాలు కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి గాను రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ మూడేళ్ళ సమయం కేటాయించారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఏ సినిమాకి ఇంత సమయం కేటాయించలేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ సమానంగా 45 కోట్ల రూపాయల వ‌ర‌కు పారితోషికం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఈ సినిమాకి 9 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు టాక్‌. ఇక మరో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్‌కు 20 కోట్ల వ‌ర‌కు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. శ్రేయకు రెండు కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన ఆర్టిస్టులకు కూడా భారీగానే ఇచ్చినట్టు తెలుస్తుంది.

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం చిత్ర లాభాల్లో 30% షేర్‌ను తీసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో కూడా బాహుబలి సినిమాకి ఇలాగే లాభాల్లో షేర్ తీసుకొని దాదాపు 50 కోట్లకు పైగానే సంపాదించినట్టు టాక్. మరి ఆ రకంగా తీసుకుంటే రాజమౌళి ఈ సినిమాకి కూడా భారీగానే సంపాదించబోతున్నట్టు తెలుస్తుంది.