RRR Collections :  మూడు రోజుల్లో 500 కోట్లు.. అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లని రాబట్టిన తెలుగు సినిమాగా......

RRR Collections :  మూడు రోజుల్లో 500 కోట్లు.. అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్

Rrr Collections

 

RRR Collections :  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దేశ విదేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ కి ముందే 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లని రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత కూడా వీకెండ్ కావడంతో భారీగానే కలెక్షన్లు వచ్చాయి.

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏరియా వైజ్ మూడు రోజుల షేర్ కలెక్షన్లు..

నైజాం – 53.50 కోట్లు

సీడెడ్ – 28.90 కోట్లు

ఉత్తరాంధ్ర – 15.54 కోట్లు

నెల్లూరు – 4.82 కోట్లు

గుంటూరు – 11.56 కోట్లు

కృష్ణా – 8.10 కోట్లు

వెస్ట్ గోదావరి – 7.98 కోట్లు

ఈస్ట్ గోదావరి – 8.69 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 139 .09 కోట్లు షేర్ కలెక్ట్ చేయగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మిగిలిన ఏరియాలలో

కర్ణాటక – 18.50 కోట్లు

తమిళనాడు – 16.20 కోట్లు

కేరళ – 5.10 కోట్లు

హిందీ – 36.50 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 4.05 కోట్లు

ఓవర్సీస్ – 56.10 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 275.54 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించగా గ్రాస్ 500 కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా 500 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా 175 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. మరో రెండు వారాల వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేకపోవడం, ఈ వీకెండ్ ఉగాది పండగ ఉండడంతో ఈ కలెక్షన్స్ ఈజీగానే వస్తాయి అంటున్నారు సినీ వర్గాలు.