RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ముంబైలో హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో తెలుగు సినిమా సౌండ్ గట్టిగా వినపడాలని ఈ ఈవెంట్ ని భారీగా ప్లాన్......

RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

Rrr

RRR :  ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేసి పాన్ ఇండియా వైడ్ ఆసక్తిని నెలకొల్పారు. ప్రేక్షకులు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 7న ఈ సినిమా విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ , సాంగ్స్ విడుదల అయి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక నిన్న రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ట్రైలర్ చుసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Prabhas : ఆసియాలోనే నంబర్ వన్ సెలబ్రిటీగా ప్రభాస్

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనుండటంతో ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో బాగా ప్రమోట్ చేస్తుండగా టీజర్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్స్ అన్ని పరిశ్రమలలోను చేశారు. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా బాలీవుడ్ లో భారీగా చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ, హిందీ భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని రాజమౌళి దగ్గరుండి భారీగా ప్లాన్ చేయిస్తున్నారు.

Krithi Shetty : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న ఉప్పెన బ్యూటీ

డిసెంబర్ మూడో వారంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయబోతున్నారు. ఆ తర్వాత ముంబైలో హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో తెలుగు సినిమా సౌండ్ గట్టిగా వినపడాలని ఈ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేయబోతున్నారు. దీని కోసం ఏపీ తెలంగాణ నుంచి మూడు వేల మంది అభిమానులను ప్రత్యేక ట్రైన్‌లో ముంబై తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు బాలీవుడ్ లో జెండా పాతేద్దామని గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ తర్వాత జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లో మరో గ్రాండ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేయనున్నట్టు సమాచారం. ఇవి మాత్రమే కాక మధ్యలో సినిమా యూనిట్ తో ప్రెస్ మీట్స్ కూడా కూడా పెట్టనున్నారు.