RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Rrr Final Release Date

RRR Movie: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం..

జనవరి 7 నుండి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మార్చి 25 న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.

ఇప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల నాలుగు సార్లు వాయిదా పడింది. (జూలై 30 – 2020).. (జనవరి 8 – 2021).. (అక్టోబర్ 13 – 2021).. (జనవరి 7 – 2022).. ఎట్టకేలకు ఐదో సారి ఫైనల్ డేట్ ఫిక్స్ చేశారు. దీంతో తారక్-చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మించారు.

Student No 1 Movie : ‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 ఏళ్ల క్రితమే చెప్పాడా!