RRR Team: గెట్ రెడీ.. గుమ్మడికాయ కొట్టేశారు..

ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్ఆర్ఆర్’ టీం హైదరాబాద్ చేరుకున్నారు. తారక్ - చరణ్ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..

RRR Team: గెట్ రెడీ.. గుమ్మడికాయ కొట్టేశారు..

Tarak Charan

RRR Team : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లను కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’.. ఆగస్టు 2 నుంచి లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూట్ చేశారు. Rrr Team 

చిత్రీకరణ పూర్తి చేసుకుని రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ టీం హైదరాబాద్ చేరుకున్నారు. తారక్ – చరణ్ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తవడంతో టీమ్‌తో కలిసి కేక్ కట్ చేసి హంగామా చేశారు రాజమౌళి. తారక్, చరణ్‌ల మీద ఒకటి, చరణ్ -అలియాలపై మరోటి.. రెండు సాంగ్స్ షూట్ చేశారని సమాచారం.

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన ‘దోస్తీ’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదల చేసిన ఐదు భాషల్లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిందీ సాంగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి, దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేది మారే అవకాశముందని తెలుస్తోంది.

RRR : అంచ‌నాలు పెంచేలా.. అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న..