Sai Dharam Tej : విరూపాక్షతో పెళ్లి పై హోప్ వచ్చింది.. కానీ Bro తో అది పూర్తిగా పోయింది..
విరూపాక్ష సినిమాతో తనకి పెళ్లి పై కొంచెం హోప్ వచ్చిందని, కానీ Bro తో అది పూర్తిగా పోయిందని సాయి ధరమ్ తేజ్ తన బాధని వెల్లడించాడు. కారణం ఏంటో తెలుసా..?
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి మెగా మల్టీస్టారర్ చిత్రం బ్రో (Bro) మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ యాంకర్ సుమకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష సినిమాతో తనకి పెళ్లి పై కొంచెం హోప్ వచ్చిందని, కానీ Bro తో అది పూర్తిగా పోయిందని వెల్లడించాడు. అయితే దానికి కారణం ఏంటని సుమ ప్రశ్నించగా తేజ్ బదులిస్తూ.. “విరూపాక్ష బ్లాక్ బస్టర్ అవ్వడంతో నన్ను కూడా ప్రత్యేకంగా అభిమానించడం మొదలు పెట్టారు. కానీ ఈ బ్రో సినిమాల అబ్బాయిలు, అమ్మాయిలు.. ఇలా ప్రతి ఒక్కరు నన్ను బ్రో అని పిలుస్తున్నారు” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
Rana Daggubati : త్రివిక్రమ్ రచనతో రానా ‘హిరణ్యకశిపుడు’.. అమెరికా వెళ్ళింది ప్రభాస్ కోసం కాదు..
కాగా బ్రో సినిమాలో పవన్ టైం గాడ్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ మూవీలో పవన్ ఈ తరహా పాత్ర పోషించాడు. ఈ సినిమాలో పవన్ పాత్ర కేవలం మూవీ స్టార్టింగ్ 15 నిముషాలు మాత్రమే కనిపించదు. ఆ తరువాత నుంచి సాయి ధరమ్ తో పవన్ పాత్ర చివరి వరకు ఉంటుంది. మూవీ మొత్తం పవన్ అండ్ తేజ్ బాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ మూవీలో పవన్ పై ఒక చిన్న ఫైట్ సీన్ కూడా ఉంటుందట. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.