Sai Pallavi : అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. కానీ ఛాన్స్ రావట్లేదు : సాయి పల్లవి

ఇటీవల సాయిపల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ అభిమాని మీరు ఎలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అని

Sai Pallavi : అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. కానీ ఛాన్స్ రావట్లేదు : సాయి పల్లవి

Sai Pallavi (Image:Instagram)

Sai Pallavi :  ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల.. సాయి పల్లవి. సినిమాల్లో ఆ డైలాగ్ చెప్పకపోయినా తనని చూస్తే అలాగే అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూనే విజయాలు సాధిస్తుంది. అందరి హీరోయిన్స్ లో తాను కచ్చితంగా స్పెషల్. తన నటనతో, తన హావభావాలతో, తన డ్యాన్స్ తో అందర్నీ అబ్బురపరుస్తుంది. ఒక మంచి కథలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ కావాలంటే తననే తీసుకోవాలి. ఇప్పటివరకు చేసిన పాత్రలు అన్ని కూడా అలాంటివే. ఇటీవలే ‘లవ్‌స్టోరి’ చిత్రంతో మన ముందుకొచ్చి చక్కటి అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది సాయిపల్లవి.

Pawan Klayan : బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’

ప్రస్తుతం సినిమా షూట్స్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో గడుపుతుంది సాయి పల్లవి. ఇటీవల సాయిపల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ అభిమాని మీరు ఎలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అని అడిగారు.

Raviteja : రవితేజ పాన్ ఇండియా సినిమా

ఈ ప్రశ్నకి సమాధానంగా సాయి పల్లవి.. కామెడీ సినిమాలు చేయాలనుందని, కామెడీ పాత్రల్లో కనిపించి అందర్నీ నవ్వించాలని ఉందని చెప్పింది. కామెడీ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. వెండితెరపై అలాంటి పాత్రలో ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో చూడాలనుంది. ప్రాపర్‌ కామెడీ స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఎవరూ అలాంటి స్క్రిప్ట్స్ నా దగ్గరికి తీసుకురావట్లేదు అని చెప్పింది.

షూటింగ్‌ లేకపోతే ఇంటి దగ్గరే ఉంటూ నచ్చిన ఫుడ్ ని తింటూ హాయిగా నిద్రపోతానని చెప్పింది. విలాసాల కంటే కూడా ప్రకృతి ఒడిలో సేదతీరడమే తనకు ఇష్టమని తెలిపింది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అని సాయి పల్లవి అభిమానులకి చెప్పింది