Sai Manjrekar : తెలుగు హీరోలపై ‘గని’ హీరోయిన్ సయీ మంజ్రేకర్ వ్యాఖ్యలు..

సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ''గని లో వరుణ్ తేజ్ తో కలిసి పని చేశాను. నేను ప‌ని చేసిన కో-స్టార్ల‌లో వ‌రుణ్‌తేజ్ స్వీటెస్ట్ ప‌ర్స‌న్. షూటింగ్‌లో వ‌రుణ్ నాకు చాలా సాయం చేశాడు.

Sai Manjrekar : తెలుగు హీరోలపై ‘గని’ హీరోయిన్ సయీ మంజ్రేకర్ వ్యాఖ్యలు..

Saiee

Sai Manjrekar :  వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా ‘గని’ సినిమా ఈ నెల 8వ తేదీన రాబోతుంది. సయీ మంజ్రేకర్ కి ఇది మొదటి తెలుగు సినిమా. త్వరలోనే అడవి శేష్ ‘మేజర్’ సినిమాతో కూడా పలకరించబోతుంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది.

ప్రస్తుతం ‘గని’ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది సయీ మంజ్రేకర్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో తన కో-స్టార్స్ తో పాటు మరికొంతమంది తెలుగు హీరోల గురించి కూడా మాట్లాడింది. సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ”గని లో వరుణ్ తేజ్ తో కలిసి పని చేశాను. నేను ప‌ని చేసిన కో-స్టార్ల‌లో వ‌రుణ్‌తేజ్ స్వీటెస్ట్ ప‌ర్స‌న్. షూటింగ్‌లో వ‌రుణ్ నాకు చాలా సాయం చేశాడు. ఏ హెల్ప్ అడిగినా విసుక్కోకుండా హెల్ప్ చేస్తాడు.”

Kuwait : విజయ్ ‘బీస్ట్’ సినిమాని బ్యాన్ చేసిన ఆ దేశం..

”మేజర్ లో అడవి శేష్ తో కలిసి నటిస్తున్నాను. అడవి శేష్ బాగా కష్టపడతాడు. ఇక తెలుగులో నాకు చాలా మంది హీరోలు ఇష్టం. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసాను. ఆ సినిమా, అందులో నాటు నాటు డ్యాన్స్ చూశాక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. వీళ్లందరితో కలిసి నటించాలని ఉంది. ప్రస్తుతానికి ఇంకా వేరే తెలుగు సినిమాలు ఏవి ఒప్పుకోలేదు. కథలు వస్తే తెలుగు హీరోల పక్కన చేయడానికి ఇష్టమే” అని తెలిపింది.