Saiee Manjrekar : బాలీవుడ్ నిర్మాత తనయుడితో ‘గని’ బ్యూటీ ప్రేమాయణం

బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ 'దబాంగ్‌ 3’ సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటుంది..............

Saiee Manjrekar : బాలీవుడ్ నిర్మాత తనయుడితో ‘గని’ బ్యూటీ ప్రేమాయణం

Saiee

Saiee Manjrekar :  బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ‘దబాంగ్‌ 3’ సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గని’ సినిమాతో సయి మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఆ తర్వాత అడవి శేష్‌ తో ‘మేజర్‌’ సినిమాలో కనిపించనుంది.

తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రేమలో మునిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత సాజిద్ నడియాద్వాలా తనయుడు సుభాన్ తో కలిసి ముంబైలో చక్కర్లు కొడుతుంది. వీరద్దరు జంటగా లంచ్‌, డిన్నర్‌ డేట్స్‌కు వెళుతూ మీడియాకి చిక్కారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుభాన్ నడియాద్వాలాతో కలిసి తిరిగేస్తుండటంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు, వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Aliya Bhatt : రణ్​బీర్​తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది

సుభాన్ కూడా త్వరలోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బాలీవుడ్ లో ప్రేమ జంటలు, ప్రేమ పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. మరి సుభాన్, సయి మంజ్రేకర్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవుతారేమో చూడాలి. వీరిద్దరూ ఇంకా కెరీర్ ఆరంభంలోనే ఉన్నారు.