Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న సినిమా ‘సలార్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటును డిమాండ్ చేస్తున్నారు.

Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?

Salaar Movie Aiming 200 Cr For Digital Rights

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Salaar : RCB పై సలార్ మూవీ టీం ట్వీట్..

అయితే ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సలార్ మూవీని హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే బిజినెస్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను స్టార్ గ్రూప్ ఏకంగా రూ.55 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకుంది.

Salaar: ఉగాది రోజున సలార్ అప్డేట్.. ఏమై ఉంటుందో..?

ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను అన్ని భాషల్లో కలిసి భారీ రేటుకు అమ్మేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ రైట్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అయితే ఇప్పటికి ఈ రైట్స్ కోసం రూ.180 కోట్ల ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ డిజిటల్ రైట్స్ డీల్ కూడా కుదిరిపోతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొత్తానికి సలార్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారిందని ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.