Salaar Teaser : సలార్ టీజర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్.. ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారుగా..
ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
![Salaar Teaser : సలార్ టీజర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్.. ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారుగా.. Salaar Teaser : సలార్ టీజర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్.. ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారుగా..](https://10tv.in/wp-content/uploads/2023/07/salaar.jpg)
Salaar Teaser releasing date announcement by movie unit
Salaar Teaser : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్.
ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్స్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు టీజర్ లేదా గ్లింప్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Animal : ‘యానిమల్’ కొత్త రిలీజ్ డేట్.. సందీప్ వంగా రణబీర్ కపూర్ మాస్ యుఫోరియా ఆ రోజే..
సలార్ టీజర్ ని జులై 6 ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు ప్రభాస్ ని వెనక నుంచి చూపిస్తూ ఓ మాస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా చిత్రయూనిట్ ప్రకటించగానే సలార్ టీజర్ అనే పదం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఇక టీజర్ రిలీజయి సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh
— Salaar (@SalaarTheSaga) July 3, 2023