Salman Khan : టైగర్ 3 సెట్స్ లో సల్మాన్ ఖాన్‌కి గాయం.. పిక్ వైరల్!

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సల్మాన్ కి గాయం అయ్యినట్లు సమాచారం.

Salman Khan : టైగర్ 3 సెట్స్ లో సల్మాన్ ఖాన్‌కి గాయం.. పిక్ వైరల్!

Salman Khan injured in the sets of Tiger 3 pic viral in social media

Salman Khan Tiger 3 : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల కిసీకా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తమిళ సినిమా ‘వీరం’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, ముఖ్య పాత్రలు చేయగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సాంగ్ లో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం యావరేజ్ గా మిగిలింది.

Arpita Khan : సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. 5 లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం..

ఈ సినిమా తరువాత సల్మాన్ నటిస్తున్న చిత్రం టైగర్ 3. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై వర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కితుంది. 2012 లో వచ్చిన ఏక్ థా టైగర్, 2017 లో వచ్చిన టైగర్ జిందా హైకి.. ఈ చిత్రం కొనసాగింపుగా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. రెండు సినిమాలు మించి ఈ మూవీలో సల్మాన్ పై అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ కి షూటింగ్ లో గాయం అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోని సల్మాన్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

Kangana Ranaut : ఎమర్జెన్సీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తి.. ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదట ఎవరికి చూపించిందో తెలుసా?

తన ఎడమ భుజానికి స్వల్పంగా గాయం అయ్యినట్లు ఆ పిక్ లో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాలో టైగర్ గా సల్మాన్ ఎంట్రీ ఇచ్చి అదరగొడితే.. ఇప్పుడు టైగర్ సినిమాలో షారుఖ్ పఠాన్ గా ఎంట్రీ ఇచ్చి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందట. ఆ సీక్వెన్స్ కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.