Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

సౌత్ వాళ్లు నార్త్ మార్కెట్ పెంచుకోవడానికి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చెయ్యడమేకాదు.. అక్కడ అదే రేంజ్ లోప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. రివర్స్ లో బాలీవుడ్ స్టార్లు కూడా సౌత్ మేకర్స్

Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

Bajrangi Bhaijaan 2

Bajrangi Bhaijaan 2: సౌత్ వాళ్లు నార్త్ మార్కెట్ పెంచుకోవడానికి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చెయ్యడమేకాదు.. అక్కడ అదే రేంజ్ లో ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. రివర్స్ లో బాలీవుడ్ స్టార్లు కూడా సౌత్ మేకర్స్ తో సినిమాలు చేస్తూ.. సౌత్ మార్కెట్ ని ఎక్స్ పాండ్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. తెలుగు రైటర్ తో సినిమా చేస్తున్నానంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Cancer Actress: క్యాన్సర్‌ను ఎదుర్కొని హీరోయిజాన్ని చూపిస్తున్న హీరోయిన్లు!

ట్రిపుల్ఆర్ ప్రమోషన్లు పీక్స్ లో ఉన్నాయి. జనవరి 7న రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు టీమ్. టాలీవుడ్ సినిమా.. బాలీవుడ్ లో మార్కెట్ కోసం ట్రై చేస్తుంటే.. బాలీవుడ్ స్టార్లు కూడా టాలీవుడ్ రైటర్స్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలా సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన భజరంగీభాయ్ జాన్ కి సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Bheemla Nayak: వెనక్కు తగ్గిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరిలో రిలీజ్

కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన భజరంగీ భాయ్ జాన్.. సినిమాకు స్టోరీ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. చాలా కాలం నుంచి ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా.. ట్రిపుల్ ఆర్ ముంబై ఈవెంట్ లో భజరంగీభాయ్ జాన్ కు సంబంధించి సీక్వెల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సల్మాన్ ఖాన్. ఆల్రెడీ విజయేంద్రప్రసాద్ ఈ భజరంగీ భాయ్ జాన్ 2 కోసం కథ రెడీ చేస్తున్నారని, త్వరలోనే సినిమా సెట్స్ మీదకెళుతుందని అనౌన్స్ చేశారు బాలీవుడ్ స్టార్.