Samantha : వెబ్ సిరీస్ చేస్తాననుకోలేదు.. వాళ్ళ వల్లే చేసాను : సమంత

స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజి పాత్రలో అందర్నీ మెప్పించింది. ఈ పాత్రకి గాను సమంత.....

Samantha : వెబ్ సిరీస్ చేస్తాననుకోలేదు.. వాళ్ళ వల్లే చేసాను : సమంత

Sam

Samantha :    సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత బాలీవుడ్ వైపు మాత్రం చూడలేదు. ఇక సినిమాల్లో బిజీగా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ లో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజి పాత్రలో అందర్నీ మెప్పించింది. తన కెరీర్ లో ఇది ఒక చాలెంజింగ్ పాత్ర అని చెప్పొచ్చు. ఈ పాత్రతో సమంత బాలీవుడ్ కి కూడా దగ్గరైంది. ఈ పాత్రకి గాను సమంతకి చాలా అవార్డులు, రివార్డులు వచ్చాయి.

ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్లో సమంతకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సిరీస్ కి అవార్డులు వచ్చిన సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ….. ‘అసలు నాకు వెబ్‌సిరీస్‌ చేయాలన్న ఆలోచన అప్పటి వరకు లేదు. కానీ డైరెక్టర్స్ రాజ్‌,డీకే నా ఆలోచనల్లో మార్పు తెచ్చారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ సిరీస్ ని వెంటనే ఒప్పుకున్నాను. ఇందులోని రాజీ పాత్రకు నేను ఊహించినదానికంటే ఎక్కవే అభినందనలు వచ్చాయి. ఈ సిరీస్‌తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం నాకు ఏర్పడింది. నేను వెబ్ సిరీస్ చేసాను అంటే అది డైరెక్టర్స్ రాజ్, డీకే వల్లే’ అని తెలిపింది.

Prabhas : జపాన్‌లో ప్రభాస్ బాటిల్స్.. పెద్ద సంస్థే ప్రభాస్ ఫొటోని వాడేస్తుందిగా

అంతే కాక ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయాను. ఇక మీదట గ్లామర్ రోల్స్‌ అంత తొందరగా ఒప్పుకోను. నటిగా ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలకి ఓకే చెప్తుంది. అందులో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఉండటం విశేషం.