Samantha : ప్రేమికుల్ని విడదీసే నెగిటివ్ రోల్‌లో సమంత

చైతూతో విడాకుల అనంతరం సమంత సినిమాల్లో దూసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయింది. దీంతో వరుస సినిమాలని ఓకే చేస్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ కి ఓకే చెప్తుంది. మామూలు కమర్షియల్ పాత్రలు...........

Samantha : ప్రేమికుల్ని విడదీసే నెగిటివ్ రోల్‌లో సమంత

Samantha

Samantha :   చైతూతో విడాకుల అనంతరం సమంత సినిమాల్లో దూసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయింది. దీంతో వరుస సినిమాలని ఓకే చేస్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ కి ఓకే చెప్తుంది. మామూలు కమర్షియల్ పాత్రలు కాకుండా నటనకి ఆస్కారం ఉన్న పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ హిందీ వెబ్‌ సిరీస్‌ లో డిఫరెంట్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక అప్పట్నుంచి సినిమా సినిమాకి వేరియేషన్ ఉండేలా చూసుకుంటుంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. ‘శాకుంతల’ సినిమాలో పురాణాల్లో పాత్రని చేయబోతుంది. ‘యశోద’ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రానుంది. హాలీవుడ్‌ మూవీ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమాలో బై-సెక్సువల్‌ పాత్రలో నటించనుంది. తాజాగా మరో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

Bangarraju : అభిమానుల్ని పిలవనందుకు క్షమించాలి : నాగార్జున

తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’. ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఖతిజా’గా సమంత ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పాత్రలో సమంత నెగెటివ్ షేడ్స్‌లో చేయనుందని సమాచారం. విజయ్ సేతుపతి, నయనతారలని విడగొట్టే నెగిటివ్ రోల్ లో సమంత చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇలా సమంత వరుసగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకెళ్లిపోతుంది.