Samantha : సమంత అరుదైన రికార్డ్.. టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో నంబర్ 1గా ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’

యూట్యూబ్ లో ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు ట్రెండ్ లో కూడా నిలిచింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే దాదాపు 90 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్..

Samantha : సమంత అరుదైన రికార్డ్.. టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో నంబర్ 1గా ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’

Samantha

 

Samantha :    ఇటీవల ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. చైతూతో విడిపోయిన తర్వాత సమంత మొదటిసారిగా ఈ ఐటెం సాంగ్ తో తెరపై కనిపించడంతో జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ తో ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ బాగా వైరల్ అయింది. సాహిత్యం పరంగా పురుషులని అవమానించారు అని విమర్శలు వచ్చినా మ్యూజిక్ పరంగా మంచి ఊపు ఉన్న ఐటెం సాంగ్ కావడంతో ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది.

యూట్యూబ్ లో ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు ట్రెండ్ లో కూడా నిలిచింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే దాదాపు 90 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ సాధించింది. యూట్యూబ్ లో “టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్” జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గత వారం నుంచి ప్రపంచంలోనే నంబర్ 1 సాంగ్ గా కొనసాగుతుంది. ఈ సాంగ్ మాత్రమే కాక మరిన్ని ‘పుష్ప’ సాంగ్స్ కూడా ఈ లిస్ట్ లో చోటు సాధించాయి.

AHA : తెలుగు ఇండియన్ ఐడల్ లో రేవంత్ అవుట్.. శ్రీరామచంద్ర ఇన్

నెం.1లో ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ తెలుగు వెర్షన్‌తో పాటు, 22వ స్థానంలో ‘పుష్ప’ సినిమా నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్, 25వ స్థానంలో ‘పుష్ప’ తమిళ్ సాంగ్ ‘సామి సామి’, 42వ స్థానంలో ‘ఊ అంటావా’ హిందీ వర్షన్ సాంగ్, 51వ స్థానంలో ‘సామీ సామీ’ తెలుగు వీడియో సాంగ్, 68వ స్థానాల్లో ‘సామి సామి’ తెలుగు లిరికల్ పాట ఉన్నాయి. దీంతో దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ‘పుష్ప’ ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సృష్టిస్తుంది.