Samantha : విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సమంత

తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విడాకుల పోస్ట్ ని డిలీట్ చేసింది. సమంత చైతూలు విడిపోయేటప్పుడు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుని సమంత నిన్న డిలీట్ చేసేసింది. అటు నాగ చైతన్య....

Samantha : విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సమంత

Sam

Samantha :  టాలీవుడ్ ఫేమస్ కపుల్, అందరికి ఇష్టమైన జంట సమంత-నాగ చైతన్య కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి విడాకులు టాలీవుడ్ ని, తెలుగు ప్రేక్షకులని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాయి. చాలా రోజుల వరకు వీరి విడాకులు వార్తల్లో నిలిచాయి. ఇప్పటికి కూడా వీరిద్దరి విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.

ముందు నుంచి సోషల్ మీడియాకి దూరంగా ఉండే చైతూ విడాకుల తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా తన పని తానూ చూసుకుంటూ సినిమాలు చేసుకుంటూ సైలెంట్ గా గడిపేస్తున్నాడు. అటు సమంత మాత్రం సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయింది. లైఫ్ కి, లవ్ కి సంబంధించిన కొటేషన్స్ పెడుతూ రోజూ వార్తల్లో నిలుస్తుంది. వరుసగా సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సమంత.

Akhanda : నన్ను, బోయపాటిని దేవుడే కలిపాడు: బాలకృష్ణ

తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విడాకుల పోస్ట్ ని డిలీట్ చేసింది. సమంత చైతూలు విడిపోయేటప్పుడు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుని సమంత నిన్న డిలీట్ చేసేసింది. అటు నాగ చైతన్య మాత్రం ఇంకా ఆ పోస్ట్ అలానే ఉంచాడు. మరి సమంత ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిందా అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే గతంలో నాగ చైతన్యతో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసేసింది. ఇప్పుడు ఈ విడాకుల ఫోటోని డిలీట్ చేయడంపై మరోసారి వార్తల్లో నిలుస్తుంది సమంత.