Samantha : చాలా కష్టమైన ఆరు నెలలు.. దీనికి ముగింపు పలకాలి.. సమంత ఎమోషనల్ పోస్ట్..

సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు ఇటీవల తెలిపింది. తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజం అని అర్ధమవుతుంది.

Samantha : చాలా కష్టమైన ఆరు నెలలు.. దీనికి ముగింపు పలకాలి.. సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha emotional post on her Instagram story

Samantha Emotional Post :  సమంత చేస్తున్న ఖుషి సినిమా, సిటాడెల్ షూటింగ్స్ పూర్తవ్వడంతో ఇటీవల సమంత కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం వరకు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. అయితే సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది.

సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా కొన్నాళ్ల క్రితం ఒక ఆరు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది. మెడిసిన్స్ తో పాటు కేరళ ఆయుర్వేదం కూడా సమంత వాడినట్టు సమాచారం. అయితే సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంతకు ఇంకా మయోసైటిస్ తగ్గలేదని తెలుస్తోంది. మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని, ఇంకా బాధపడుతుందని, త్వరలోనే అమెరికాకు ఈ చికిత్స కోసం సమంత వెళ్ళబోతున్నట్టు, కొన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉండి సమంత మయోసైటిస్ కి పూర్తి చికిత్స తీసుకుంటుందని, సమంత పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ ఇండియాకు వస్తుందని సన్నిహితులు చెప్పారు.

Rishab Shetty : పుట్టిన రోజు నాడు మంచిపని మొదలుపెట్టిన స్టార్ హీరో.. పేద విద్యార్థుల కోసం ‘రిషబ్ శెట్టి’ ఫౌండేషన్

తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజం అని అర్ధమవుతుంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ లో మరో మూడు రోజుల్లో కారవాన్ లైఫ్ మొదలవ్వబోతుంది అని పెట్టింది. అంటే ఇప్పట్లో బయటకి ఎక్కడికి రాదు అని సమాచారం. ఇక మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే సమంతకు అమెరికాలో చికిత్స మొదలుపెట్టనున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు, ప్రముఖులు సమంత త్వరగా కోలుకొని రావాలని, మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.