Samantha : 8 నెలలుగా చాలా ఇబ్బంది పడ్డా.. ఇంకా ధైర్యంగా ముందుకి వెళ్తా.. సమంత ఎమోషనల్ పోస్ట్..

శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చింది. ఇక అప్పట్నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయింది, షూటింగ్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. త్వరలో...............

Samantha : 8 నెలలుగా చాలా ఇబ్బంది పడ్డా.. ఇంకా ధైర్యంగా ముందుకి వెళ్తా.. సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha emotional post on her tough journey

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమా సమయంలో మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స్ తీసుకుంది. సమంత త్వరగా కోలుకొని తిరిగిరావాలని, సినిమాలు చేయాలని అంతా ప్రార్థించారు. కొన్ని నెలలు సైలెంట్ గా ఉండి, ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకొని మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది సమంత.

శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చింది. ఇక అప్పట్నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయింది, షూటింగ్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. త్వరలో ఖుషి సినిమా షూట్ లో కూడా జాయిన్ అవ్వనుంది. ఇక చాలా రోజుల తర్వాత జిమ్, వర్కౌట్లు చేయడంతో వాటిని కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..

సమంత తాజాగా సిటాడెల్ టీంతో చర్చిస్తున్న ఫోటో, సిటాడెల్ కోసం చేసిన ఫోటోషూట్ ఫోటో, శాకుంతలం ఈవెంట్ ఫోటో.. ఇలా కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. గట్టిగా ఊపిరి పీల్చుకో. త్వరలో అన్నీ సర్దుకుంటాయని నీకు నేను మాటిస్తున్నాను. చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళావు. గత ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నావు. ఆ కష్టమైన పరిస్థితులని ఎలా ఎదుర్కున్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంగా అడుగేశావు. ఈ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను. మరింత ధైర్యంగా ముందుకి సాగిపో.. అంటూ తనకు తాను చెప్పుకున్నట్టు పోస్ట్ చేసింది. జనవరి నెల ఇలా గడిచిపోయిందంటూ ఆ ఫోటోలని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది సామ్. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా సమంత స్ట్రాంగ్ గా తిరిగి వస్తుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.