Samantha: 3 గంటల్లో 10 లక్షల లైకులు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందబ్బా?!

సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో అది వార్తయిపోతుంటుంది. నిజంగా వైరల్ కావాలనే ఇలా చేస్తారో.. లేక నెటిజన్లే వైరల్ చేస్తారో కానీ.. వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. సహజంగా నటీమణుల హాట్ ఫోటోలు, వీడియోలకు వ్యూస్ రావడం.. వైరల్ కావడం చూస్తుంటాం.

Samantha: 3 గంటల్లో 10 లక్షల లైకులు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందబ్బా?!

Samantha

Samantha: సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో అది వార్తయిపోతుంటుంది. నిజంగా వైరల్ కావాలనే ఇలా చేస్తారో.. లేక నెటిజన్లే వైరల్ చేస్తారో కానీ.. వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. సహజంగా నటీమణుల హాట్ ఫోటోలు, వీడియోలకు వ్యూస్ రావడం.. వైరల్ కావడం చూస్తుంటాం. కానీ, సమంత తన సొంత బ్రాండ్ సాకికి చెందిన ఓ సాధారణ డ్రెస్ లో దిగిన ఫోటో కూడా తెగ వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

సమంత తన సొంత లేబుల్‌ ‘సాకీ’ దుస్తులు ధరించి కారులో కూర్చొని ఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘మై లవ్‌ సాకీ వరల్డ్‌’ అంటూ సమంత పోస్ట్ చేసిన ఈఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల లైకులు వచ్చి చేరుతున్నాయి. కేవలం ఈ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలలోనే 10 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. నిజానికి ఇది తన బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా సామ్ పెట్టిన పోస్ట్. కానీ, ఇది కూడా ఈ రేంజ్ లో వ్యూస్ అంటే సామ్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.

ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే గురువారం శాకుంతలం సినిమా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది. ‘థ్యాంక్యూ శకుంతల..’ అంటూ సినిమా యూనిట్ ఆమెకు వీడ్కోలు పలికింది. తమిళంలో కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా షూటింగ్ లో ఉండగా మరోవైపు బుల్లితెరపై హోస్ట్, వెబ్ సిరీస్ లపై చర్చకు జరుగుతున్నాయి. మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా సమంత తన వుమెన్‌ క్లాతింగ్‌ బ్రాండ్‌ ‘సాకీ’ దుస్తులు, స్కూలింగ్ బిజినెస్ పై ప్రచారమూ చేసుకుంటోంది. అలా ప్రచారంలో భాగంగానే పెట్టిన ఈ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. మరి నెటిజన్లకు అంత స్పెషల్ ఏం కనిపించిందో!

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)