Samantha : డోసు పెంచి ఆల్కహాల్‌ని ప్రమోట్ చేస్తున్న సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఇప్పటివరకు కొన్ని కమర్షియల్ ప్రోడక్ట్స్ ని తన సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసింది సమంత. తాజాగా ఓ ఆల్కాహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. గతంలో కూడా కొంతమంది హీరోయిన్స్ ఇలా ఆల్కహాల్‌ను...

Samantha : డోసు పెంచి ఆల్కహాల్‌ని ప్రమోట్ చేస్తున్న సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Samantha

Samantha :  సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఒకపక్క వరుస సినిమాలకు ఓకే చెప్తూ షూటింగ్ చేస్తుంది. రెమ్యునరేషన్ భారీగా పెంచేసి స్పెషల్ సాంగ్స్ కి కూడా ఒప్పుకుంటుంది సమంత. మరోపక్క బిజినెస్ లతో కూడా బిజీగా ఉంది. ఇప్పటికే ఉన్న బిజినెస్ లు కాకుండా తాజాగా మరో కొత్త బిజినెస్ లో కూడా అడుగు పెట్టింది. వీటితో పాటు కమర్షియల్ యాడ్స్, సోషల్ మీడియాలో ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేస్తూ బాగా సంపాదిస్తుంది. సమంత చేసే పనులు చూస్తుంటే ఇంకా బాగా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

 

ఇప్పటివరకు కొన్ని కమర్షియల్ ప్రోడక్ట్స్ ని తన సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసింది సమంత. తాజాగా ఓ ఆల్కాహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. గతంలో కూడా కొంతమంది హీరోయిన్స్ ఇలా ఆల్కహాల్‌ను ప్రమోట్ చేశారు. వారిపై కూడా విమర్శలు వచ్చాయి. సమంత బ్లెండర్స్ ప్రైడ్ అనే ఆల్కహాల్ బ్రాండ్ కి ప్రమోషన్ చేసింది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ వీడియో కూడా చేసింది సామ్. ఈ వీడియోలో కొంచెం బోల్డ్ గానే కనిపించింది సమంత. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సామ్.

Mahesh Babu : సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్..

దీంతో నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, ఒక పక్కన ఆల్కహాల్ తాగొద్దని చెబుతుంటే మీరేమో ఇలా డబ్బుల కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు అంటూ సమంతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ యాడ్ లో తాను వేసిన బట్టల గురించి కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. డబ్బులిస్తే ఎలాంటి యాడ్స్ అయినా చేస్తారా అంటూ ఆ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా స్టార్లు యాడ్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. గతంలో కూడా చాలా మంది కొన్ని యాడ్స్ వల్ల ట్రోల్ అయిన సందర్భాలు ఉన్నాయి.