Samantha: సామ్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌత్ నటిగా గుర్తింపు!

సమంతకి అరుదైన గౌరవం లభించింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆ బాధ నుండి బయటపడేందుకు తీర్ధ యాత్రలు, విహార యాత్రలు చేస్తున్న సామ్ తన కెరీర్ పై మరింత దృష్టిపెట్టి బిజీ అయ్యేందుకు..

Samantha: సామ్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌత్ నటిగా గుర్తింపు!

Samantha

Samantha: సమంతకి అరుదైన గౌరవం లభించింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆ బాధ నుండి బయటపడేందుకు తీర్ధ యాత్రలు, విహార యాత్రలు చేస్తున్న సామ్ తన కెరీర్ పై మరింత దృష్టిపెట్టి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్టులకు ఒకే చెబుతూ సౌత్ నుండి నార్త్ వరకు చుట్టేస్తోంది. కాగా, ఇదే క్రమంలో తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం లభించింది.

Sakshi Malik: సోషల్ మీడియా ‘సాక్షి’గా అందాల జాతర

గోవాలో జరగనున్న ‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో ప్రసంగించేందుకు సమంత ఆహ్వానం అందుకుంది. ఈ నెల 20వ తేది నుంచి 28వ తేది వరకు జరగనున్న ఈ ఫిలిం ఫెస్టివల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని అన్ని బాషల నటీనటులు పాల్గొననుండగా ఈ ఫెస్టివల్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది.

Kamna Jethmalani: సొగసుల సుందరి సొట్టబుగ్గల కామ్నా!

ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సమంతతో పాటు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయిను కూడా నిర్వాహకులు ఎంపిక చేయగా.. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా, ప్రస్తుతం సమంతా నటించిన కాతు వాకుల రెండు కాదల్, శాకుంతలం సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉండగా డ్రీమ్ వారియర్ మూవీస్, శ్రీదేవి పిక్చర్స్ బ్యానర్లలో రెండు సినిమా మొదలుకానున్నాయి.