Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను

గతంలో సమంత షూటింగ్స్ కి వెళితే ఆమె పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ మేకప్ మెన్ మాత్రమే ఆమెతో వెళ్లేవాళ్లు. కానీ ఇటీవల ఆమె ఫిట్నెస్ ట్రైనర్స్................

Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను

 

Samantha :  సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యశోద సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతుంది. లాంగ్ షెడ్యూల్ ఉండటంతో సమంత కొన్ని రోజులు కాశ్మీర్ కి షిఫ్ట్ అయింది. సమంత అందంగా, ఫిట్ గా ఉండటానికి ప్రతిరోజు తన డైట్, వ్యాయామాలు మిస్ చేయకుండా ఫాలో అవుతుంది. సమంతని ఫిట్ గా, అందంగా ఉంచడానికి తన టీం అంతా కూడా ఇటీవల సమంత వెనకే వెళ్తున్నారు.

 

గతంలో సమంత షూటింగ్స్ కి వెళితే ఆమె పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ మేకప్ మెన్ మాత్రమే ఆమెతో వెళ్లేవాళ్లు. కానీ ఇటీవల ఆమె ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా వెళ్తున్నారు. చైతో విడాకుల అనంతరం కెరీర్ మీద ఫుల్ ఫోకస్ చేయడంతో తన బాడీ, అందం మీద కూడా ఫోకస్ చేసింది. దీంతో తన ఫిట్నెస్ ట్రైనర్స్ ని కూడా తనతో పాటే షూటింగ్స్ కి తీసుకెళ్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతుండటంతో అక్కడికి తన ఇద్దరు ట్రైనర్స్ ని తీసుకెళ్లింది. ట్రైనర్స్ తో పాటు తను వర్కౌట్స్ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని కూడా తీసుకెళ్తుంది.

 

Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..

తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత. ఈ వీడియోని షేర్ చేసి..”ఎర్లీ మార్కింగ్స్ విత్ మై టీం. అమన్‌ కరానీ, జునైద్‌ షేక్‌. నేను ఎక్కడికి వెళ్లినా వీళ్ళ ఇద్దరి నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను” అని పోస్ట్ చేసింది. అలాగే అక్కడ తను ఉండే హోటల్ గురించి.. ”నాకు అన్ని రకాల మంచి సౌకర్యాలు, రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు, నేను వర్కౌట్లు చేసుకునేందుకు కావాల్సిన స్క్వాట్ ర్యాక్స్‌ని మీ బాల్‌రూమ్‌లోకి అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేసింది.