Samantha : నేను మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తోడున్నది వాళ్లే : సమంత

ఇటీవల రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన 'సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్' అనే కార్యక్రమంలో సమంత తాజాగా పాల్గొంది. ఈ కార్యక్రమంలో తన మానసిక సమస్యల గురించి, సైక్రియాటిస్టుల.......

Samantha : నేను మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తోడున్నది వాళ్లే : సమంత

Samantha 1

Samantha :   చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. రోజూ జీవితానికి సంబంధించిన కొటేషన్స్ పెడుతుంది. వరుస సినిమాలు ఓకే చేస్తూ కెరీర్ లో కూడా దూసుకుపోతుంది. ఇటీవల రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన ‘సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్’ అనే కార్యక్రమంలో సమంత తాజాగా పాల్గొంది. ఈ కార్యక్రమంలో తన మానసిక సమస్యల గురించి, సైక్రియాటిస్టుల గురించి మాట్లాడింది.

Samantha 2

Samantha 2

Ramesh Babu : ముగిసిన ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు

ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. ‘‘నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయమే తీసుకున్నాను. నేను ఈ రోజు ధైర్యంగా నిలబడటానికి, జీవితంలో ముందుకి సాగటానికి, నేను మానసిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు తోడున్నది నా స్నేహితులు, కుటుంబం, సైక్రియాటిస్టులు మాత్రమే. వాళ్ళ సహాయంతోనే నేను మానసిక సమస్యల్ని ఎదురుక్కున్నాను. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకి గాయం అయినప్పుడు కూడా సైక్రియాటిస్టులని సంప్రదించాలి’ అని తెలిపింది.