Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..

తాజాగా ఇవాళ విజయ్ బర్త్‌డే కావడంతో సమంత కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ సినిమా కశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడే..............

Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..

Samantha

Vijay Devarakonda :  సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలోనే వారిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. అప్పట్నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వారిద్దరూ కలిసి ప్రస్తుతం శివ నిర్వాణ సినిమాలో చేస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల సమంత బర్త్‌డే రాగా విజయ్ దేవరకొండ సర్‌ప్రయిజ్ ప్లాన్ చేసి సెలబ్రేషన్స్ చేశాడు. షూటింగ్ సెట్‌లో షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్‌డేని సెలబ్రేట్ చేశాడు. దీనికి సమంత చాలా హ్యాపీగా ఫీల్ అయి విజయ్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పింది.

Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీతో కార్లో నాగార్జున షికార్లు..

తాజాగా ఇవాళ విజయ్ బర్త్‌డే కావడంతో సమంత కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ సినిమా కశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడే అర్ధరాత్రి విజయ్‌తో కేక్ కటింగ్ చేయించింది. ఓ రూమ్ అంతా బర్త్‌డే డెకరేషన్ చేయించి సమంత అర్ధరాత్రి విజయ్‌తో కేక్ కట్ చేయించింది. ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. దీంతో విజయ్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాడట. వీరిద్దరి బాండింగ్ ఈ సినిమాతో మరింత పెరుగుతుందని అంటున్నారు.