Samantha: గే క‌పుల్‌కు సామ్ శుభాకాంక్ష‌లు.. వైరల్‌గా మారిన పోస్ట్!

మాజీ అక్కినేని కోడలు సమంతా ఏం చేసినా అది ఇప్పుడు ఓ వార్తయి పోతుంది. సమంతా కూడా ప్రతి విషయంపై స్పందించి తన అభిప్రాయాన్ని కూడా గట్టిగానే చెప్తుంది. పెళ్ళికి ముందు నుండే బలమైన..

Samantha: గే క‌పుల్‌కు సామ్ శుభాకాంక్ష‌లు.. వైరల్‌గా మారిన పోస్ట్!

Samantha

Samantha: మాజీ అక్కినేని కోడలు సమంతా ఏం చేసినా అది ఇప్పుడు ఓ వార్తయి పోతుంది. సమంతా కూడా ప్రతి విషయంపై స్పందించి తన అభిప్రాయాన్ని కూడా గట్టిగానే చెప్తుంది. పెళ్ళికి ముందు నుండే బలమైన మనస్తత్వం కలిగిన సామ్ ఇప్పుడు విడాకుల తర్వాత మరింత స్ట్రాంగ్ అయింది. అందుకే, ఏ విషయంలోనైనా తాను చెప్పాలి అనుకున్నదిగా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తుంది. ఇప్పటికే సామ్ ఇలా స్పందించడం చాలా విషయాలలో చూడగా ఇప్పుడు ఓ గే జంట పెళ్లి అంశంలో కూడా చూస్తున్నాం.

Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్!

ఇండియన్ పీనల్ కోడ్ 377 నిషేధిస్తూ సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కుల పెళ్లి విషయంలో ఈ మధ్య సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు తర్వాత దేశంలో గే జంటలు నిర్భయంగా బయటకొస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణలో ఓ గే జంట పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమైంది. పెద్దల అంగీకారంతోనే డిసెంబర్ లో జరగనున్న ఈ పెళ్లిపై రెండు మూడు రోజులుగా వార్తాపత్రికలలో కూడా వచ్చింది. అలా ఓ పేపర్ లో వచ్చిన ఈ గే జంట పెళ్లి వార్తను పోస్ట్ చేసిన సమంతా.. గే క‌పుల్‌కు శుభాకాంక్ష‌లు చెప్పింది.

AHA 2.0: దీపావ‌ళి వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

గే జంటకు సామ్ శుభాకాంక్షలు చెప్పిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సమంతా కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ గే అంటూ ఆ మధ్య సామ్ విడాకుల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రీతమ్ కూడా సీరియస్ గానే స్పందించాడు. ఆ గొడవ అలా ఉండగానే సామ్ ఇలా గే జంటకి శుభాకాంక్షలు చెప్పడం మళ్ళీ సోషల్ మీడియాలో నెటిజన్లకు పనిదొరికింది. ఎవరు ఏమనుకున్నా.. సామ్ చెప్పాలనుకున్నది చేప్పే తీరడం విశేషం.