Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A14, గెలాక్సీ A23 5G ఫోన్లపై భారీ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy A Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల భారత మార్కెట్లో రెండు కొత్త గెలాక్సీ A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. అందులో Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A14, గెలాక్సీ A23 5G ఫోన్లపై భారీ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy A14 and Galaxy A23 5G phones are now on sale_ Price, offers

Samsung Galaxy A Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల భారత మార్కెట్లో రెండు కొత్త గెలాక్సీ A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. అందులో Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శాంసంగ్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంది. Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A14 5G : ఫీచర్లు, ధర ఇవే :
శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫోన్ Dark Red, Light Green, Black వంటి 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.16,499 ప్రారంభ ధరతో వస్తుంది. 6GB, 8GB RAM కలిగిన మరొక మోడల్ ధర వరుసగా రూ. 18,999, రూ. 20,999గా ఉంది. శాంసంగ్ SBI, IDFC, ZestMoneyతో పాటు రూ. 1,382 నుంచి నెలవారీ EMIతో పాటు రూ. 1,500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

Read Also : Samsung Galaxy S23 Pre-Orders : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌ను కేవలం రూ.1,999లకే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. మరెన్నో బెనిఫిట్స్.. డోంట్ మిస్..!

Exynos 1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ ఫోన్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో వస్తుంది. 2MP డెప్త్, మాక్రో సెన్సార్‌లతో పాటు 50MP కెమెరాతో వచ్చింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలకు Samsung Galaxy A14 5G ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. శాంసంగ్ డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. Samsung Galaxy A14 5G నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, రెండు OS అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

Samsung Galaxy A14 and Galaxy A23 5G phones are now on sale_ Price, offers

Samsung Galaxy A14 and Galaxy A23 5G phones are now on sale

శాంసంగ్ గెలాక్సీ A23 5G: ఫీచర్లు ధర ఇవే :
శాంసంగ్ Galaxy A23 5Gలో సిల్వర్, లైట్ బ్లూ, ఆరెంజ్ అనే 3 కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6GB RAM+128GB ROM, 8GB RAM+128GB ROM రెండు మోడల్‌లు ఉన్నాయి. ధర వరుసగా రూ. 22,999, రూ. 24,999గా ఉంటాయి. SBI, IDFC, ZestMoneyతో రూ. 2వేలు వరకు క్యాష్‌బ్యాక్, రూ. 1,576 నెలవారీ EMIని అందిస్తోంది.

శాంసంగ్ Galaxy A23 5G 6.6-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 16GB RAM వరకు పొడిగించుకోవచ్చు. కెమెరాల్లో అల్ట్రా-వైడ్, డెప్త్, మాక్రో లెన్స్‌తో పాటు 50MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. శాంసంగ్ Galaxy A23 5G OIS, ‘No Cash Cam’ ఫీచర్‌తో వస్తుంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?