Samsung Galaxy S22 : 55 సెకన్లలో శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా 4 సార్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Samsung Galaxy S22 : మీరు శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ డివైజ్‌ను హ్యాకర్లు కేవలం 55 సెకన్లలోనే హ్యాక్ చేయగలరు.. 2022లో రిలీజ్ అయిన Galaxy S23 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను హ్యాకర్లు కేవలం ఒక నిమిషం లోపే హ్యాక్ చేశారు.

Samsung Galaxy S22 : 55 సెకన్లలో శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా 4 సార్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Samsung Galaxy S22 hacked in less than a minute

Samsung Galaxy S22 : మీరు శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ డివైజ్‌ను హ్యాకర్లు కేవలం 55 సెకన్లలోనే హ్యాక్ చేయగలరు.. 2022లో రిలీజ్ అయిన Galaxy S23 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను హ్యాకర్లు కేవలం ఒక నిమిషం లోపే హ్యాక్ చేశారు. Bleeping Computer నివేదిక ప్రకారం.. Pentest Limited నుంచి పరిశోధకుల బృందం Samsung Galaxy S22 ఫోన్‌లో జీరో-డే బగ్‌ను అమర్చింది. అయితే ఈ బగ్ ద్వారా హ్యాకర్లు కేవలం 55 సెకన్లలో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా హ్యాక్ చేశారు. అంటే.. ఒక నిమిషం కన్నా తక్కువ.. నివేదిక ప్రకారం.. Pwn2Own హ్యాకింగ్ పోటీలో హ్యాక్ చేసేవారికి 25వేల డాలర్లు సంపాదించింది. ఆసక్తికరంగా.. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగిన ఈవెంట్‌లో Galaxy S22 ఫోన్ నాలుగు సార్లు హ్యాక్ అయింది.

Samsung Galaxy S22 hacked in less than a minute

Samsung Galaxy S22 hacked in less than a minute

Read Also : Samsung Galaxy M04 Sale : శాంసంగ్ గెలాక్సీ M04 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Pwn2Own హ్యాకింగ్ పోటీలో 14 వేర్వేరు దేశాల నుంచి మొత్తం 26 మంది పోటీదారులు పాల్గొన్నారు. Pwn2Own Toronto మొదటి రోజున STAR ల్యాబ్స్ బృందం, చిమ్ అని పిలిచే సెక్యూరిటీ రీసెర్చర్ Galaxy S22ని లక్ష్యంగా చేసుకుని మరో రెండు జీరో-డేలను ఛేదించినట్టు Bleeping Computer నివేదిక పేర్కొంది. నాలుగు సందర్భాల్లోనూ, S22 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న అన్ని అప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ చేసిన Android ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్‌ కలిగి ఉంది. హ్యాకింగ్ పోటీ సమయంలో టీమ్‌లు, భద్రతా పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్ ఆటోమేషన్ హబ్‌లు, ప్రింటర్లు, వైర్‌లెస్ రూటర్‌లు, నెట్‌వర్క్-అటాచ్డ్ స్టోరేజ్, స్మార్ట్ స్పీకర్ల కేటగిరీలు వంటి పలు విభాగాల్లో డివైజ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అన్నీ లేటెస్టుగా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే ఉన్నాయి. నివేదిక ప్రకారం.. Apple iPhone 13, Google Pixel 6 స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ఏ బృందం సైన్ అప్ చేయలేదు.

Pwn2Own టొరంటో 2022 అనేక కేటగిరీలలో 63 జీరో-డేతో 989,750 డాలర్ల రివార్డుతో ముగిసింది. మరోవైపు.. Samsung Galaxy S23 సిరీస్‌ను 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దక్షిణ కొరియా దినపత్రిక, కొరియా JoongAng డైలీ నివేదిక ప్రకారం.. రాబోయే నెలలో అమెరికాలో జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో S22 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరిలో కచ్చితమైన రోజు, తేదీ ఇంకా రివీల్ చేయలేదు. నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S23, Samsung S23 Plus, Samsung S23 Ultra అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను అందించవచ్చు. హ్యాండ్‌సెట్‌లు సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయని భావిస్తున్నారు. ఇటీవల లాంచ్ అయిన Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Android 13 Beta Update : నథింగ్ ఫోన్ (1)లో ఆండ్రాయిడ్ 13 ఓపెన్ బీటా అప్‌డేట్ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!