Sankranthi Movies : ఈ సంక్రాంతి వార్ చాలా రేర్.. రెండు సినిమాలు.. ఒకే నిర్మాణ సంస్థ.. ఒకే హీరోయిన్..

ఈ సంక్రాంతి మూవీస్ లో అరుదైన అంశమేంటంటే ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ సినిమాలు రెండింటికీ నిర్మాణ సంస్థ ఒకటే అవడం. ఈ రెండు సినిమాల్నీ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించడం............

Sankranthi Movies : ఈ సంక్రాంతి వార్ చాలా రేర్.. రెండు సినిమాలు.. ఒకే నిర్మాణ సంస్థ.. ఒకే హీరోయిన్..

Sankranthi Movies are very special this year

Sankranthi Movies :  2023 సంక్రాంతి మూవీస్ లిస్ట్ రెడీ అయిపోయింది. రిలీజ్ డేట్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయాయి. అయితే వీటిలో రెండు పెద్ద సినిమాల్ని ఒకే బ్యానర్ నిర్మించడం గ్రేట్ అనుకుంటుంటే ఈ రెండింట్లోనూ హీరోయిన్ గా నటించేది ఒకే బ్యూటీ అవడం ఇంకా గ్రేట్.

2023 సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలున్నప్పటికీ అభిమానుల ఉత్సాహాన్ని రెండింతలు చేసే సినిమాలు మాత్రం రెండే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీస్ రెండూ మాస్ ఫీస్ట్ ఇవ్వడానికి ఒక రోజు తేడాతో థియేటర్స్ లోకి దిగిపోతున్నాయి. జవవరి 12న ‘వీరసింహారెడ్డి’, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్స్ లో రచ్చచేయడం కన్ఫర్మ్.

ఈ సంక్రాంతి మూవీస్ లో అరుదైన అంశమేంటంటే ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ సినిమాలు రెండింటికీ నిర్మాణ సంస్థ ఒకటే అవడం. ఈ రెండు సినిమాల్నీ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించడం ఇంట్రెస్టింగ్ పాయింట్. సంక్రాంతి పోటీ లో ఉన్న ఇద్దరు సీనియర్ స్టార్స్ సినిమాల్లో ఒకే బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుండడం కూడా చాలా రేర్ గా జరుగుతుంటుంది. అయితే ఆ ఇద్దరి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించడం అదే మొదటి సారి అవడం మరో విశేషం.

Santosh Shobhan : సంక్రాంతి బరిలో చిన్న సినిమా.. స్టార్ హీరోలకి పోటీగా యువ హీరో..

పవన్ కళ్యాణ్, చరణ్, యన్టీఆర్ లాంటి వారసుల సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది కానీ చిరు, బాలయ్య తో హీరోయిన్ గా ఇంతవరకూ నటించలేదు. ‘వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి’ సినిమాలతో ఆ ముచ్చట కూడా తీరబోతోంది. అయితే శ్రుతి హాసన్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో మాత్రం ఈ రెండు సినిమాల మధ్యన అటు, ఇటు ఈ నెల్ ఆరోజులు ఫుల్ బిజీగా ఉంటుందేమో అంటున్నారు ఫ్యాన్స్. ఒకే సంస్థ నుంచి, ఒకే హీరోయిన్ నుంచి సంక్రాంతికి రెండు సినిమాలు, అది కూడా స్టార్ హీరోలు కావడంతో అందరి దృష్టి ఈ సినిమాలపైనే ఉంది.