Sankranthi Movies : దిల్‌రాజు వర్సెస్ చిరు, బాలయ్య ఫ్యాన్స్.. ఈ సారి ఫ్యాన్ వార్స్ లేవు..

థియేటర్స్ ఇస్తే చిరంజీవి సినిమాకి ఇవ్వాలి లేదా బాలకృష్ణ సినిమాకి ఇవ్వాలి అంతే కానీ బయట నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాకి ఎలా ఇస్తారు అని చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి దిల్ రాజుపై కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు బ్లాక్ చేసిన థియేటర్స్ దగ్గరికి వెళ్లి...............

Sankranthi Movies : దిల్‌రాజు వర్సెస్ చిరు, బాలయ్య ఫ్యాన్స్.. ఈ సారి ఫ్యాన్ వార్స్ లేవు..

Sankranthi Movies war between dil raju and chiru, balayya

Sankranthi Movies :  ఈ సంక్రాంతికి పోటీ చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉంటుంది అనుకున్నారు అంతా. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు హిట్ అని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీంతో ఈ సారి సంక్రాంతి వార్ గట్టిగానే జరగబోతుంది, ఫ్యాన్ వార్స్ కచ్చితంగా జరుగుతాయి అని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.

రెండు భారీ తెలుగు సినిమాల మధ్య దిల్ రాజు తమిళ డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా మాములుగా రిలీజ్ అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ దిల్ రాజు చాలా చోట్ల థియేటర్స్ ని బ్లాక్ చేసి వారసుడు సినిమాని మాత్రమే రన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే కొన్ని చోట్ల థియేటర్స్ లిస్ట్ కూడా వచ్చేశాయి. దీంట్లో వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఉండి చిరు, బాలయ్య సినిమాలకి తక్కువ థియేటర్స్ ఉండటంతో ఇద్దరి ఫ్యాన్స్ ఇప్పుడు దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు.

Manchu Manoj : ఈ పోస్ట్‌తో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడా?

థియేటర్స్ ఇస్తే చిరంజీవి సినిమాకి ఇవ్వాలి లేదా బాలకృష్ణ సినిమాకి ఇవ్వాలి అంతే కానీ బయట నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాకి ఎలా ఇస్తారు అని చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి దిల్ రాజుపై కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు బ్లాక్ చేసిన థియేటర్స్ దగ్గరికి వెళ్లి చిరు, బాలయ్య ఫ్యాన్స్ గొడవ కూడా చేస్తున్నారట తమ హీరోల సినిమాలని రిలీజ్ చేయమని. మొత్తానికి దిల్ రాజు వల్ల చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ కలిసిపోయారు. వారసుడు ఈ రెండు సినిమాలకి ఒక రోజు ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఒక్క రోజు ఎక్కువ థియేటర్స్ ఇచ్చినా ఈ రెండు సినిమాల రిలీజ్ టైములో మాత్రం మాకు థియేటర్స్ ఇవ్వకుండా వారసుడు ఉంటే మాత్రం పరిస్థితులు ఇంకోలా ఉంటాయని చిరు, బాలయ్య అభిమాన సంఘాలు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫ్యాన్ వార్స్ లేకుండా ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగుతున్నాయి.