Sai Pallavi : మీ ప్రేమని ఎలా తిరిగివ్వాలి..

సాయిపల్లవి మాట్లాడుతూ.. ''చాలా మంది ప్రేక్షకులు ఎదురుపడినప్పుడు అచ్చం మా అమ్మాయిలాగా లేదంటే మా చెల్లిలాగా ఉన్నావని అంటారు. మీరంతా ఇలా మీ ప్రేమని చూపిస్తున్నారు....................

Sai Pallavi : మీ ప్రేమని ఎలా తిరిగివ్వాలి..

Sai Pallavi

Sai Pallavi :  రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం జూన్ 17న రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. మొదట్నుంచి కూడా సినిమా అంతా సాయి పల్లవి చుట్టే తిరుగుతుందని, సాయి పల్లవి మెయిన్ లీడ్ అని డైరెక్టర్, హీరో చెప్తున్నారు. ట్రైలర్ చూసిన వారి|కి కూడా ఇది అర్థమైపోతుంది.

తాజాగా విరాట పర్వం ఆత్మీయ వేడుక అంటూ వరంగల్ లో భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి తెలిసిందే. సాయి పల్లవి వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఈలలు, కేకలు వేసి ఉత్సాహం చూపించారు.

Nayan-Vignesh : నయనతార-విగ్నేష్ శివన్ రిసెప్షన్ ఫోటోలు

ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. ”చాలా మంది ప్రేక్షకులు ఎదురుపడినప్పుడు అచ్చం మా అమ్మాయిలాగా లేదంటే మా చెల్లిలాగా ఉన్నావని అంటారు. మీరంతా ఇలా మీ ప్రేమని చూపిస్తున్నారు. అంత ప్రేమని మీకు ఎలా తిరిగిస్తాననే బాధ ఉంటుంది. ఊరి మట్టిలో నుంచి వచ్చిన ఇలాంటి కథల్లో నటిస్తే కొంచెమైనా తిరిగి ఇవ్వగలుగుతున్నాననే తృప్తి ఉంది. ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించకపోతే మళ్లీ ఇలాంటి కథలు రావు’’ అని తెలిపింది.