Mahesh Babu : సితార, తమన్ స్పెషల్ ఎంట్రీలుగా ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ రిలీజ్

తాజాగా నిన్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. పెన్నీ పెన్నీ.. అంటూ సాగే ఈ పూర్తి పాటని నేడు విడుదల చేశారు. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలోనే........

Mahesh Babu : సితార, తమన్ స్పెషల్ ఎంట్రీలుగా ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ రిలీజ్

Mahesh

Sithara :  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాని మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, కళావతి సాంగ్ బాగా పాపులర్ అయ్యాయి. కళావతి సాంగ్, అందులో మహేష్ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి కూడా.

తాజాగా నిన్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. పెన్నీ పెన్నీ.. అంటూ సాగే ఈ పూర్తి పాటని నేడు విడుదల చేశారు. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలోనే మహేష్ కూతురు కూడా కనిపించి స్టెప్పులతో అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇవాళ రిలీజ్ చేసిన పూర్తి సాంగ్ ని ప్రమోషనల్ సాంగ్ లా రిలీజ్ చేశారు. ఇందులో సితారతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించి స్టెప్పులు వేసి అలరించాడు.

Mahesh Babu : నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా అంటున్న సితార

పెన్నీ పెన్నీ.. అంటూ ఈ పాట ఆద్యంతం అలరించింది. ఇందులో మహేష్, సితార స్టెప్పులతో మెప్పించారు. ఈ సాంగ్ ని సింగర్ నాకాష్ అజీజ్ ఆలపించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.