Nivetha Thomas : పాలు పితికిన నివేదా థామస్, వీడియో వైరల్

బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని..పాలు పితుకొంది. మరో వ్యక్తి ఓ గ్లాసు పట్టుకోగా..అందులో పాలు పడుతున్నాయి. చివరగా...గ్లాసు పట్టుకున్న పాలను చూపారు నివేదా థామస్.

Nivetha Thomas : పాలు పితికిన నివేదా థామస్, వీడియో వైరల్

Niveda

Nivetha Thomas : సినిమాలో నటించే హీరో..హీరోయిన్లు.. ఎక్కడకు వెళ్లినా..ఏ పని చేసినా…వాటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. స్వయంగా వాళ్లు లేదా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలు రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇందులో అభిమానులు స్పందిస్తూ..కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా..నటి నివేదా థామస్ సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భామ చేసిన పనికి కొంతమంది నెటిజన్లు వావ్ అంటుండగా..మరికొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Read More : Vakeel Saab : అఫీషియల్.. ఓటీటీలో ‘వకీల్ సాబ్’.. కొత్త ట్రైలర్ అదిరిందిగా!..

ఇంతకు నివేదా ఏం చేశారు ?

అవును ఇంతకు నివేదా ఏం చేశారనేగా మీ ప్రశ్న..ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో ఉంది. అందులో పశువులు కనబడుతున్నాయి. ఓ ఆవు దగ్గర బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని..పాలు పితుకొంది. మరో వ్యక్తి ఓ గ్లాసు పట్టుకోగా..అందులో పాలు పడుతున్నాయి. చివరగా…గ్లాసు పట్టుకున్న పాలను చూపారు నివేదా థామస్. ఈ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడుతారు..వెళ్లినా..పాలు పితికే ధైర్యం చేయలేరు…భేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1,81,458 likes వచ్చాయి.

Read More : అనుకున్నదే అయింది.. ఓటీటీలో ‘వి’..

ఇక నివేదా థామస్ విషయానికి వస్తే..‘నాని’ హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా నటించి..ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో నటన, లుక్స్ తో ఆకట్టుకోవడంతో పలు ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ..అన్నీ సెలక్ట్ చేసుకోకుండా..యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలను ఒప్పుకుంటూ…మంచి విజయాలను సంపాదించుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఓ పాత్రను పోషించారు. నానితో కలిసి మరో సినిమా ‘నిన్ను కోరి’లో కూడా నటించారు. టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, ‘వి’ సినిమాలో నటించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాష సినిమాలకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)