Shaakuntalam: శాకుంతలం డిజిటల్ రైట్స్.. భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రైమ్..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ఎపిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో సమంత మరోసారి తన సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Shaakuntalam: శాకుంతలం డిజిటల్ రైట్స్.. భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రైమ్..?

Shaakuntalam Digital Rights Acquired By Amazon Prime

Shaakuntalam: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ఎపిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో సమంత మరోసారి తన సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Shaakuntalam: అల్లు అర్హపై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన శాకుంతలం టీమ్!

అయితే, ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని భావించినా, పలు కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. శాకుంతలం మూవీ ఇంకా రిలీజ్ కాకముందే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

Shaakuntalam: సమంతను చూసి సైడవుతున్న హీరోలు!

ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇక ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తోండగా, భారీ క్యాస్టింగ్‌తో గుణశేఖర్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమాతో సమంత కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.