Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతోంది.

Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..

Shaakuntalam Movie Launched

Shaakuntalam: సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతోంది.

Shaakuntalam
శాకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.
దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చెయ్యగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వడంతో పాటు దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

Shaakuntalam

‘శాకుంతలం’ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి, కెమెరా : శేఖర్ వి జోసెఫ్, ఆర్ట్ : అశోక్ కుమార్, కాస్ట్యూమ్స్ : నీతా లుల్లా, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌, అల‌గ‌ర్‌స‌మీ, స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌: వెంక‌ట్‌, డ్యాన్స్ : రాజు సుందరం.