Shaakuntalam : విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. గుణశేఖర్ మార్క్ మూవీ!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. హిందూ ఇతిహాసాలు ఆధారంగా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ చేస్తుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఒకప్పటి గుణశేఖర్ మార్క్ కనిపిస్తుంది.

Shaakuntalam : విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. గుణశేఖర్ మార్క్ మూవీ!

Shaakuntalam Official Trailer released

Shaakuntalam : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా ‘శాకుంతలం’. హిందూ ఇతిహాసాలు ఆధారంగా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ చేస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఒకప్పటి గుణశేఖర్ మార్క్ కనిపిస్తుంది.

Samantha : ‘శాకుంతలం’లో చాలా కష్టంగా అనిపించింది..

ఈ భూమి మీద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ, మేనకా-విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది అంటూ మొదలైన ట్రైలర్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రిచ్ విజువల్స్, క్వాలిటీ గ్రాఫిక్స్ తో సినిమాని చాలా అందంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ట్రైలర్ లో సమంత ఇంట్రడక్షన్ సీన్ అయితే హైలైట్. తన ప్రేమకోసం దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురి అయ్యి, అటు ప్రేమ చేతిలో కూడా మోసపోయి శకుంతల ఎన్ని కష్టాలు ఎదురుకుంది అనేది చాలా బాగా చూపించాడు. అలాగే బాహుబలి లాంటి వార్ సన్నివేశాలు మళ్ళీ ఈ సినిమాల్లో కనిపించబోతున్నాయి అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. నిజం చెప్పాలి అంటే రిలీజ్ కి ముందే గుణశేఖర్ సినిమా సక్సెస్ ని అందుకున్నాడు.

ఈ సినిమాల్లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. ప్రిన్స్ భారత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ఎండ్ లో సింహంపై అల్లు అర్హ కూర్చున్న షాట్ ఇంకో హైలైట్. దిల్ రాజు సమర్పకుడిగా చేస్తున్న ఈ సినిమాని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. నిర్మాణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ అని చెప్పాలి.