Shannu Deepu : బ్రేకప్ చెప్పింది దీప్తి.. మా అబ్బాయి కాదు.. వాళ్ళు కలుస్తారు : షణ్ముఖ్ తండ్రి | Shanmukh Father about Shannu Deepu Breakup

Shannu Deepu : బ్రేకప్ చెప్పింది దీప్తి.. మా అబ్బాయి కాదు.. వాళ్ళు కలుస్తారు : షణ్ముఖ్ తండ్రి

ఇటీవల షణ్ముఖ్ తండి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ''వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. బ్రేకప్‌ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల..

Shannu Deepu  : బ్రేకప్ చెప్పింది దీప్తి.. మా అబ్బాయి కాదు.. వాళ్ళు కలుస్తారు : షణ్ముఖ్ తండ్రి

Shannu Deepu :   సోషల్ మీడియా స్టార్స్ షణ్ముఖ్, దీప్తి సునైనా వీళ్ళిద్దరూ ఫేమస్ లవ్ కపుల్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోను నటించారు. అయితే ఇటీవల షన్ను బిగ్ బాస్ నుంచి వచ్చాక దీప్తి సునైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి రిప్లై గా తాను హ్యాపీగా ఉండాలి అని బాధతో షణ్ముఖ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే అప్పుడే షన్నుకి విడిపోవడం ఇష్టం లేదని, దీప్తినే బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అది నిజమే అని తెలుస్తుంది. ఇటీవల దీప్తి బర్త్ డేకి షన్ను పోస్ట్ కూడా పెట్టాడు బర్త్ డే విషెస్ చెప్తూ. కానీ దీప్తి పట్టించుకోలేదు. షన్ను ఇప్పటికి కూడా దీప్తి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయిందని సన్నిహితుల వద్ద బాధపడుతున్నట్లు సమాచారం. బ్రేకప్ చెప్పేసిన తర్వాత దీప్తి షన్నుని ఫోన్ లో, సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసిందని తెలిసింది. తాజాగా ఈ విషయంపై షణ్ముఖ్ తండ్రి ఇటీవల స్పందించాడు.

Talasani Srinivas Yadav : తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

ఇటీవల షణ్ముఖ్ తండి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ”వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. బ్రేకప్‌ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్‌ మీడియాలో అలా పోస్ట్‌ పెట్టింది. వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరమే లేదు” అని తెలిపాడు. షణ్ముఖ్ తండ్రి చెప్పిన ఈ మాటలు విని షన్ను దీపు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళు నిజంగా కలుస్తారో లేదో చూడాలి.

×