Bigg Boss 5 : లవ్ ఫెయిల్యూర్.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను : షణ్ముఖ్

షణ్ముఖ్‌ ఈ టాస్క్ లో మాట్లాడుతూ.. ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా జీవితం అయిపోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్‌ చేసుకుందామనుకున్నా

Bigg Boss 5 : లవ్ ఫెయిల్యూర్.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను : షణ్ముఖ్

Shannu

Bigg Boss 5 :  బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్పాలంటూ ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ లైఫ్ లోని బాధాకరమైన సంఘటనలు షేర్ చేశారు. కంటెస్టెంట్స్ షేర్ చేసుకున్న సంఘటనలు విని ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టారు.

యూట్యూబ్ ఫేమస్ షణ్ముఖ్‌ ఈ టాస్క్ లో మాట్లాడుతూ.. ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా జీవితం అయిపోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్‌ చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు. కానీ నేను తీయలేదు. తర్వాత అతడు డోర్ ని పగలగొట్టి లోపలకు వచ్చి సూసైడ్ చేసుకుంటావా అంటూ నన్ను కొట్టాడు. వాడివల్లే ఇవాళ నేను బతికున్నాను. ఆ తర్వాత ‘వైవా’ షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన నా పేరెంట్స్‌, కజిన్స్‌కు రుణపడి ఉంటాను అని తెలిపాడు. షణ్ముఖ్ ఏడవడంతో కంటెస్టెంట్స్ ఓదార్చారు.

Telugu Star Hero’s: మూడు పాటలు.. ఆరు స్టెప్పులతో మన స్టార్స్!.

ఇక మరో యూట్యూబర్ షణ్ముఖ్ స్నేహితురాలు కూడా తన జ్ఞాపకాలని షేర్ చేసుకొని చాలా ఎమోషనల్ అయింది. నా పెళ్లి సెట్ అయ్యాక పెళ్లి టైంకి అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ నన్ను నానా మాటలు అన్నారు. మా అమ్మని కూడా అన్నారు. తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి అంటూ నన్ను, మా అమ్మని అన్నారు. అప్పుడే డిసైడ్‌ అయ్యాను. నేనేంటో చూపిస్తానని.. అందుకే ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌ వచ్చి కెరియర్‌ ప్రారంభించాను అని తెలిపి ఎమోషనల్ అయింది. ఇలా కంటెస్టెంట్స్ అంతా తమ లైఫ్ లోని బాధల్ని చెప్పుకొని ఏడ్చేశారు. ఆ బాధలు విని ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు.