Sahithi : శేఖర్ మాస్టర్ కూతురి ఫేక్ ఐడీలకి చెక్.. అఫిషియల్ ఖాతాకు ఒక్కరోజులో 20 వేల మంది ఫాలోవర్స్

ఇటీవల శేఖర్ మాస్టర్ కూతురు సాహితి పేరు మీద ఇంస్టాగ్రామ్ లో అనేక ఫేక్ అకౌంట్స్ వచ్చాయి. గతంలోనే శేఖర్ మాస్టర్ ఈ ఫేక్ అకౌంట్స్ తీసేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా చాలా ఫేక్........

Sahithi : శేఖర్ మాస్టర్ కూతురి ఫేక్ ఐడీలకి చెక్.. అఫిషియల్ ఖాతాకు ఒక్కరోజులో 20 వేల మంది ఫాలోవర్స్

Shekar Master Daughter

Shekar Master :  ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌‌గా కొనసాగుతున్నారు. బుల్లితెరపై జడ్జిగా, వెండితెరపై కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉన్నారు. వీటితో పాటు నిర్మాతగా మారి తన యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ కూతురు సాహితి, కొడుకు విన్నీ కూడా మంచి డ్యాన్సర్లు. వాళ్ళు కూడా చాలా షోలలో పార్టిసిపేట్ చేశారు. కూతురు సాహితి చదువుతో పాటు డ్యాన్సర్ గానే కాక ఫ్యాషన్ బొటిక్ కూడా నడుపుతుంది.

అయితే ఇటీవల శేఖర్ మాస్టర్ కూతురు సాహితి పేరు మీద ఇంస్టాగ్రామ్ లో అనేక ఫేక్ అకౌంట్స్ వచ్చాయి. గతంలోనే శేఖర్ మాస్టర్ ఈ ఫేక్ అకౌంట్స్ తీసేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా చాలా ఫేక్ అకౌంట్స్ రావడంతో నిన్న తన కూతురికి అధికారికంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. ఈ విషయంపై ఓ వీడియో పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.

Samantha : ఆ ఐటెం సాంగ్‌కి సమంతనే కరెక్ట్ : దేవిశ్రీ ప్రసాద్

ఇందులో తన కూతురి పేరుతో చాలా ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయి అందుకే అఫిషియల్ గా మేమే అకౌంట్ క్రియేట్ చేశాము అని ఆ అకౌంట్ ని వీడియోతో పాటు పోస్ట్ చేశారు. దీంతో శేఖర్ మాస్టర్ అభిమానులు సాహితి అకౌంట్ ని కూడా ఫాలో అయ్యారు. అకౌంట్ క్రియేట్ చేసిన 13 గంటల్లోనే 21 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ఇలా కొత్త రికార్డు సృష్టించింది.

View this post on Instagram

A post shared by Sekhar Master (@sekharmaster)