Shivani Rajashekar : మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కూతురు..

శివాని మొదటి సినిమా 'అద్భుతం'. ఈ సినిమాతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత www సినిమాలో తన నటనతో కూడా మెప్పించింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో...........

Shivani Rajashekar :  మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కూతురు..

 

Shivani Rajashekar :   యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ఓ వెలుగు వెలిగి మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు కూడా వరుస సినిమాలు తీస్తున్నారు. ఇక రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఇద్దరూ కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్నారు, వరుస సినిమాలని లైన్లో పెట్టారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని చెల్లి కంటే లేట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇండస్ట్రీలోకి.

శివాని మొదటి సినిమా ‘అద్భుతం’. ఈ సినిమాతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత www సినిమాలో తన నటనతో కూడా మెప్పించింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో ఒక తమిళ్ సినిమా కూడా ఉంది. ఇక శివాని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా శివాని మరో ఆసక్తికర విషయాన్నీ తెలిపింది. శివాని మిస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొనబోతున్నట్టు తెలిపింది.

Sreemukhi : శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ ని చూశారా??

ఈ మేరకు శివాని కొన్ని ఫోటోలని షేర్ చేసి.. ”మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇందులో పాల్గొనబోతున్న అందమైన మహిళలందరికీ నాతో సహా ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శివానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరి శివాని ఈ పోటీల్లో ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.