Shruthi Hassan : ‘బెస్ట్ సెల్లర్’గా శృతిహాసన్.. బాలీవుడ్ వెబ్ సిరీస్

బాలీవుడ్ లో శృతిహాసన్ 'బెస్ట్ సెల్లర్' అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ కథ మొత్తం కూడా శృతిహాసన్ చుట్టూనే తిరుగుతుందట. మంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఈ వెబ్ సిరీస్ లో శృతిహాసన్.......

Shruthi Hassan : ‘బెస్ట్ సెల్లర్’గా శృతిహాసన్.. బాలీవుడ్ వెబ్ సిరీస్

Shruthi Hassan

Shruthi Hassan :   కరోనా రాకతో ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగింది. అనేక రకాల ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్, నిర్మాతలు సైతం ఓటీటీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఓటీటీలలో సినిమాలు, సిరీస్ లు చేస్తున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. గతంలో ‘పిట్టకథలు’ అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా మరో వెబ్ సిరీస్ తో రాబోతుంది.

బాలీవుడ్ లో శృతిహాసన్ ‘బెస్ట్ సెల్లర్’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ కథ మొత్తం కూడా శృతిహాసన్ చుట్టూనే తిరుగుతుందట. మంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఈ వెబ్ సిరీస్ లో శృతిహాసన్ చేసింది. అయితే ఎక్కువ ప్రమోషన్ లేకుండానే ఈ సిరీస్ షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 18 నుంచి బెస్ట్ సెల్లర్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

Raviteja : సినిమా రిలీజ్ అవ్వకముందే ‘ఖిలాడీ’ డైరెక్టర్‌కి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

హిందీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ‘బెస్ట్ సెల్లర్’ వెబ్ సిరీస్ ను ప్రముఖ రచయిత రవి సుబ్రహ్మణియన్ రచించిన నవల బెస్ట్ సెల్లర్ నుండి తెరకెక్కించారు. ఒక సాదారణ యువతి జర్నలిస్ట్ గా మారి సమాజంపై జరుగుతున్న చెడుపై పోరాడే కథతో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇక శృతిహాసన్ మరో వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది.