Shubman Gill : సినిమాల్లోకి క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. స్పైడర్ మ్యాన్ సినిమా కోసం ఏం చేస్తున్నాడో తెలుసా?

హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్:ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇండియాలో కూడా ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భారీగా రిలీజ్ చేస్తుంది

Shubman Gill : సినిమాల్లోకి క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. స్పైడర్ మ్యాన్ సినిమా కోసం ఏం చేస్తున్నాడో తెలుసా?

Shubman Gill gave voice to Spider Man Character in Spider-Man: Across the Spider Verse Movie

Shubman Gill :  IPL 2023లో తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు టీమిండియా క్రికెటర్(Cricketer) శుభ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న శుభ్‌మన్ గిల్ ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలతో చెలరేగి పలుమార్లు గుజరాత్(Gujarat) టీంకి విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఈ టీమిండియా ఓపెనర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.

హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్:ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇండియాలో కూడా ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భారీగా రిలీజ్ చేస్తుంది. ‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ సినిమాను ఇండియాలో.. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, పంజాబీ, గుజరాతి, మరాఠీ, బెంగాలీ, కన్నడ, మలయాళం.. భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఇండియన్ వర్షన్ లో పవిత్ర్ ప్రభాకర్ అన్న క్యారెక్టర్ తో సాగబోతోంది.

Ponniyin Selvan 2 : 300 కోట్లకు పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్.. ఇది సరిపోదు అంటున్న సినీ వర్గాలు..

అయితే ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి హిందీ, పంజాబీ వర్షన్ లో టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి హిందీ, పంజాబీ భాషల్లో క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన వాయిస్ తో అలరించనున్నాడు. చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపి ప్రమోషన్స్ కూడా చేస్తుంది. ఈ స్పైడర్ మ్యాన్ సినిమా జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. శుభ్‌మన్ గిల్ స్పైడర్ మ్యాన్ కు వాయిస్ ఇచ్చాడని తెలిసి క్రికెట్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.