Siddarth : చిన్న గాయమే సర్జరీ కాదు.. ‘మా ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికే లండన్ నుంచి వచ్చాను..

ఇటీవల సిద్దార్థ్ కి సర్జరీ జరిగిందనే వార్తలపై స్పందిస్తూ.. మహా సముద్రం క్లైమాక్స్ షూట్‌లో చిన్న గాయమైంది. దాని ట్రీట్మెంట్ కోసమే లండన్ వెళ్ళాను.

Siddarth : చిన్న గాయమే సర్జరీ కాదు.. ‘మా ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికే లండన్ నుంచి వచ్చాను..

Siddarth

Siddarth :  మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి శంకర్ డైరెక్షన్ లో ‘బాయ్స్’ సినిమాతో హీరో అయి తెలుగులో ‘బొమ్మరిల్లు’, ‘నువొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి ఎన్నో మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సిద్దార్థ్. గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలకి దూరం అయ్యాడు. వేరే సినిమాలు కూడా తగ్గించాడు. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ‘మహా సముద్రం’లో శర్వానంద్ తో కలిసి మల్టి స్టారర్ గా రాబోతున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇటీవల సిద్దార్థ్ కి సర్జరీ జరిగిందనే వార్తలపై స్పందిస్తూ.. మహా సముద్రం క్లైమాక్స్ షూట్‌లో చిన్న గాయమైంది. దాని ట్రీట్మెంట్ కోసమే లండన్ వెళ్ళాను. డైరెక్టర్ అజయ్ భూపతి సర్జరీ అని చెప్పేశాడు. దీంతో మా అమ్మానాన్నలు కూడా తెగ కంగారు పడిపోయి ఫోన్లు చేశారు. వెంటనే అజయ్ భూపతికి ఫోన్ చేసి అలా చెప్పావ్ ఏంటి అని అడిగితే మీరే కదా ట్రీట్మెంట్ అని చెప్పారు అని అన్నాడు. ట్రీట్మెంట్‌కు, సర్జరీకి చాలా తేడా ఉందని క్లారిటీ ఇచ్చాను. అది చిన్న గాయం మాత్ర‌మే సర్జరీలాంటిదేమీ జరగలేదు అని తెలిపాడు.

Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

అలాగే ‘మా’ ఎలక్షన్స్ పై కూడా మాట్లాడుతూ.. నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్‌ను. ఆహుతి గారు ఉన్న సమయంలోనే మెంబ‌ర్‌షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు వేస్తున్నాను. రోజు మీడియాలో అన్నీ ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని నా మనసులో ఏమనిపిస్తుందో వారికే ఓటు వేస్తాను. నా ట్రీట్మెంట్ అయిపోయింది. రెస్ట్ తీసుకోవడమే ఎలాగో మా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని వచ్చేసాను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను అని సిద్దార్థ్ తెలిపారు.