Siddharth – Aditi : శర్వా నిశ్చితార్థంలో వీరిని గమనించారా? మరోసారి వైరల్ అవుతున్న ఈ జంట..

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి శర్వానంద్ నిశ్చితార్థానికి కలిసి జంటగా హాజరయ్యారు. దీంతో మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. నిశ్చితార్థంలో దిగిన వీరి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి...........

Siddharth – Aditi : శర్వా నిశ్చితార్థంలో వీరిని గమనించారా? మరోసారి వైరల్ అవుతున్న ఈ జంట..

Siddharth and Aditi rao hydari attends sharwa engagement as couple goes viral again

Siddharth – Aditi :  టాలీవుడ్ హీరో శర్వానంద్ గురువారం నాడు రక్షిత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుకకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. అయితే ఈ వేడుకలో ఒక జంట అందరి దృష్టిని ఆకర్షించింది. హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి శర్వానంద్ నిశ్చితార్థానికి కలిసి జంటగా హాజరయ్యారు. దీంతో మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. నిశ్చితార్థంలో దిగిన వీరి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

గత కొన్నాళ్లుగా సిద్దార్థ్, అదితి డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు ముంబైలో కలిసి పార్టీలకు, డిన్నర్స కి వెళ్తూ, చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకి అనేకసార్లు చిక్కారు. దీని గురించి వారిని అడిగినా స్పందించట్లేదు. కానీ వీరిద్దరూ మాత్రం డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా, పలువురు సన్నిహితులు కూడా అంటున్నారు. శర్వా, సిద్దార్థ్, అదితి కలిసి మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇటీవల బాలయ్య షోలో శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ షిప్ పై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా అవును వాళ్ళు డేటింగ్ లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశాడు.

Sai Dharam Tej : కలర్స్ స్వాతితో కలిసి మ్యూజికల్ ఆల్బమ్ తో రాబోతున్న సాయి ధరమ్ తేజ్..

ఇప్పుడు శర్వా నిశ్చితార్థానికి ఇద్దరూ కలిసి రావడం, జంటగా ఫొటోలు దిగడంతో, జంటగా కలిసి వెళ్లడంతో మరోసారి సిద్దార్థ్, అదితి వార్తల్లోనిలుస్తున్నారు. నిజంగానే వేరు డేటింగ్ లో ఉన్నారా? ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటారా అని మరోసారి అంతా ఆలోచిస్తున్నారు. దీనిపై వీరిద్దరూ స్పందిస్తారేమో అని చూస్తున్నారు. మొత్తానికి శర్వా నిశ్చితార్థం వల్ల సిద్దార్థ్, అదితి మరోసారి వైరల్ అవుతున్నారు.