Kalyanam Kamaneeyam : సింగర్ మనో.. సీరియల్ ఎంట్రీ..

జీ తెలుగు ఛానల్ లో జనవరి 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ అనే సీరియల్ ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన లాంచింగ్‌ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సీరియల్ లో...

Kalyanam Kamaneeyam : సింగర్ మనో.. సీరియల్ ఎంట్రీ..

Mano

Singer Mano :  ఇటీవల సినీ పరిశ్రమ ప్రముఖులు వారికి సంబంధించిన ఒక్క క్రాఫ్ట్ లోనే కాక అన్ని క్రాఫ్ట్ లలోను వారి ట్యాలెంట్ ని చూపిస్తున్నారు. ప్రముఖ సింగర్ మనో పాటలతో పాటు అప్పుడప్పుడు తెరపై నటిస్తారు కూడా. ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా కూడా చేశారు. మరో వైపు బుల్లితెరపై ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలలో జడ్జిగా కూడా అలరిస్తున్నారు. అప్పుడప్పుడియు ఆ షోలలో స్కిట్స్ చేసి తన నటనతో మెప్పిస్తున్నారు కూడా. తాజాగా సీరియల్స్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు సింగర్ మనో.

Salman Khan : కత్రినాకైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్.. మీ వివాహంతో అందరూ…

జీ తెలుగు ఛానల్ లో జనవరి 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ అనే సీరియల్ ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన లాంచింగ్‌ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సీరియల్ లో సీనియర్ నటి హరిత, మేఘన లోకేష్, మధు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ నిర్మాత శ్రీరామ్‌ మాట్లాడుతూ.. మొదటిసారి ఒక సీరియల్‌లో సింగర్‌ మనో నటిస్తున్నారని, ఈ సీరియల్ లో సింగర్ మనో నటన అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. సింగర్ మనో సీరియల్ ఎంట్రీ ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ తో ఇస్తున్నారు. దీంట్లో మంచి పేరు వస్తే కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని సీరియల్స్ లో నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.