Sir Movie : తన రికార్డు తానే బ్రేక్ చేయడమే కాదు.. బాలీవుడ్ హీరో కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసిన ధనుష్..

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన మొదటి బై లింగువల్ చిత్రం 'సార్'. తమిళనాడు లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకుంది ఈ చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కు పైగా ప్రీమియర్స్ పడడంతో...

Sir Movie : తన రికార్డు తానే బ్రేక్ చేయడమే కాదు.. బాలీవుడ్ హీరో కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసిన ధనుష్..

Sir Movie first day collections

Sir Movie : తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన మొదటి బై లింగువల్ చిత్రం ‘సార్’. మొదటి సినిమా తొలిప్రేమ తోనే అదిరిపోయే హిట్టుని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తన మునపటి సినిమాల జోనర్ నుంచి బయటకి వచ్చి, ఒక సోషల్ ఎలిమెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు దర్శకుడు. చదువుని వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. తమిళనాడు లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకుంది ఈ చిత్రం.

Sir Movie : ‘సార్’ సినిమాని పైరసీ చేస్తే ఇలా కంప్లైంట్ చేయండి.. పైరసీని ఎంకరేజ్ చేయకండి..

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కు పైగా ప్రీమియర్స్ పడడం, ఆ షోస్ లో మంచి టాక్ రావడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకునేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4-5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. దీంతో ధనుష్ సూపర్ హిట్ మూవీ ‘రఘువరన్ బీ-టెక్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని ‘సార్’ మూవీ వన్ డే లోనే కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు హిందీ స్టార్ హీరో సినిమా కలెక్షన్స్ ని కూడా ఈ మూవీ బ్రేక్ చేసింది.

అలవైకుంఠపురంలో సినిమాని రీమేక్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన సినిమా ‘షెహజాదా’. ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టింది. ధనుష్ సార్ మూవీ మొత్తం మీద రూ.12 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా ధనుష్ కి తెలుగు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది అనే చెప్పాలి. దీంతో శేఖర్ కములతో ధనుష్ చేస్తున్న సినిమాకి ఈ మార్కెట్ కలిసొస్తుంది.