Bigg Boss 5: షన్నుతో రిలేషన్‌పై తల్లి వార్నింగ్.. సిరి బాయ్‌ఫ్రెండ్ ఏమన్నాడంటే

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో 12 మంది ఎలిమినేషన్ కాగా ప్రస్తుతం ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు.

Bigg Boss 5: షన్నుతో రిలేషన్‌పై తల్లి వార్నింగ్.. సిరి బాయ్‌ఫ్రెండ్ ఏమన్నాడంటే

Bigg Boss 5 (1)

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో 12 మంది ఎలిమినేషన్ కాగా ప్రస్తుతం ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. షణ్ముఖ్, సిరి, కాజల్, రవి, మానస్, సన్నీ, ప్రియాంకాలు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా వీరిలో టైటిల్ విన్నర్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఎవరికి వారికి అభిమానులు ఏర్పడి భారీగానే వీరికి ప్రమోట్ చేస్తుండడంతో మరింత ఆసక్తిగా మారింది.

Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!

ఇక, తాజాగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వారి సొంత కుటుంబ సభ్యులను కలిసే అవకాశం అందించాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ సభ్యులను బిగ్ బాస్ ఒక్కరిని ఇంట్లోకి పంపించగా ఇల్లంతా ఎమోషన్స్ తో కూడిన సందడిగా మారింది. ఇక, కొందరు కంటెస్టెంట్ల వారి కుటుంబ సభ్యులు వారి ఆట గురించి బయట టాక్ ను ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో ఇంట్లోకి వచ్చిన సిరి తల్లి ఆమె ఆట తీరు, షన్నుతో హగ్గులు, రిలేషన్ గురించి వార్నింగ్ ఇచ్చింది. దీంతో సిరి తల్లి మాటలు కూడా వైరల్ గా మారాయి.

Jr NTR: పవన్ సినిమాల్లో తారక్‌కి ఇష్టమైన సినిమా ఇదే..!

తాజాగా ఈ వ్యవహారంపై సిరి బాయ్‌ఫ్రెండ్‌, కాబోయే భర్త శ్రీహాన్‌ కూడా స్పందించాడు. సిరి మథర్‌కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉం‍టున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇప్పుడు శ్రీహాన్‌ ఇన్ స్టా స్టోరీ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.